సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు.. 66 మందిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు

  • ఆపరేషన్ ఆక్టోబస్‌ 3.0లో భాగంగా వారిని అరెస్టు చేసిన పోలీసులు
  • 13 రాష్ట్రాల్లో దాడుల నిర్వహించిన సైబర్ క్రైమ్ పోలీసులు
  • 1,194 ఘోస్ట్ సిమ్ కార్డుల గుర్తింపు
ఆపరేషన్ ఆక్టోబస్‌ 3.0లో భాగంగా సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు అందిస్తున్న 66 మందిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా పోలీసులు 13 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించారు. ఘోస్ట్ సిమ్ కార్డులతో దేశవ్యాప్తంగా ఎన్నో సైబర్ నేరాలు చేసినట్లు గుర్తించారు. పద్దెనిమిది బృందాలతో ఏడురోజుల పాటు ఈ ఆపరేషన్‌ను కొనసాగించగా, 1,194 ఘోస్ట్ సిమ్ కార్డులను గుర్తించి, వాటిలో 544 కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, పంజాబ్‌ రాష్ట్రాలలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. సైబర్ నేరగాళ్ళకు 20 మంది పీవోఎస్ ఏజెంట్లు సహకారం అందించినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో 10 మంది వోడాఫోన్ ఐడియా, ఏడుగురు ఎయిర్‌టెల్, ముగ్గురు జియో పీవోఎస్ ఏజెంట్లను అరెస్టు చేశారు. సిమ్ కోసం వచ్చిన వారికి తెలియకుండా మరో సిమ్ యాక్టివేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

Hyderabad Police
Cyber Crime
Ghost SIM cards
Operation Octopus 3.0
Cyber Fraud
POS Agents

More Telugu News